i-pill FAQs
 
   

వచ్చే మెన్ట్ర్సువల్ సైకిల్ వరకూ ఐ-పిల్ ఒక గుణకరమైన గర్భ నిరోధక సాధనంగా పని చేస్తుందా?

 
 
  ఎమర్జెన్సీ కాంట్రాసెప్టివ్ (ఆపత్కాల గర్భ నిరోధక) పిల్ అంటే ఏమిటి?
  అసురక్షితమైన సెక్స్ జరిగిన తరవాతనో, లేక గర్భ నిరోధక సాధనాలు విఫలం అయిన తరవాతనో, అన్‌ప్లాన్డ్ ప్రెగ్నెన్సీ / అనాలోచిత గర్భ ధారణ జరగకుండా నిరోధించడానికి, ఎమర్జెన్సీ కాంట్రాసెప్టివ్ పిల్ ఒక ఉపయోగకరమైన సురక్షిత, సులభ మార్గం.
 
 
 
   
  ఐ-పిల్ అంటే ఏమిటి?
  ఐ-పిల్ సిప్లా వారి ద్వారా తయారు చేయబడిన ఒక ఎమర్జెన్సీ కాంట్రాసెప్టివ్ పిల్. ఒక ఐ-పిల్ డోస్, అసురక్షితమైన సెక్స్ జరిగిన తరవాతనో, లేక గర్భ నిరోధక సాధనాలు విఫలం అయిన తరవాతనో, సంభవమయ్యే అసంకల్పిత గర్భ ధారణను నిరోధించడానికి ఉపయోగపడే ఒక సురక్షిత, సులభ మార్గం. ఐ-పిల్ కెమిస్ట్ దుకాణాలు అన్నిట్లోను ప్రిస్క్రిప్షన్ లేకుండా దొరుకుతుంది.
 
 
 
 
  ఐ-పిల్‌ను ఎప్పుడు వాడాలి?
 

అసురక్షితమైన సెక్స్ జరిగిన సందర్భంలో, మీరు గర్భ ధారణ జరగకూడదని కోరుకుంటే, వీలైనంత త్వరగా, అంటే 12 గంటలలోగానో, లేదా అసురక్షితమైన సెక్స్ జరిగిన తరవాత 72 గంటలు దాటకుండానో, ఐ-పిల్ తీసుకోవాలి.

క్రింద ఇవ్వబడిన పరిస్థితులలో ఐ-పిల్ గర్భ నిరోధకానికి ఒక మద్దతునిచ్చే సాధనంగా కూడా పని చేస్తుంది:

  • గర్భ నిరోధక సాధనాలు విఫలం అయినప్పుడు
  • అసురక్షితమైన సెక్స్ జరిగినప్పుడు
  • మీరు మాములుగా వాడే గర్భ నిరోధక సాధనాన్ని సవ్యంగా వాడనప్పుడు
  • బలవంతంగా శారీరక సంపర్కం జరిగినప్పుడు
 
 
 
 
  ఐ-పిల్ వాడకానికి నిర్దేశాలు ఏమిటి?
 

ఐ-పిల్ నోటి ద్వారా తీసుకోవలసిన ఒక సింగిల్ డోస్ మాత్ర. భోజనం తరవాత, ఒక గ్లాసెడు నీళ్లతో పాటు దీన్ని తీసుకోవాలి. అసురక్షితమైన సెక్స్ తరవాత గాని, గర్భ నిరోధక సాధనాలు విఫలం అయినప్పుడుగాని, వీలైనంత త్వరగానో, లేదా 72 గంటలు దాటకుండానో తీసుకోవాలి.

 
 
 
 
  ఐ-పిల్‌ను ఎలాంటి పరిస్థితులలో వాడకూడదు?
 

గర్భ ధారణ అప్పటికే జరిగిపోయిన పరిస్థితులలో ఐ-పిల్ పని చేయదు. ఎందుకంటే ఇది గర్భ నిరోధకానికి కేవలం మద్దతునిచ్చే సాధనం లేదా ఎమర్జెన్సీ గర్భ నిరోధక సాధనం మాత్రమే. ఇది నియమానుసారం వాడబడే గర్భ నిరోధక సాధనాలకు ప్రత్యామ్నాయం కాదు. దీన్ని అసురక్షితమైన సెక్స్ జరిగిన 72 గంటల తరవాత తీసుకుంటే, ఇది పని చేయదు.

ఐ-పిల్‌లో ఉన్న లెవోనోర్జెస్ట్రెల్ అనే మందు పదార్థం వల్ల మీకు ఎలెర్జీ కలిగే పక్షంలో, ఐ-పిల్ వాడుక సిఫారసు చేయబడదు.

 
 
 
 
  ఐ-పిల్‌ను ఎవరు వాడవచ్చు?
  గర్భ నిరోధక సాధనాలు లేకపోవడం వల్లనో, వాటిని వాడకపోవడం వల్లనో, అసంకల్పితంగా గర్భం దాల్చే పరిస్థితిని ఎదుర్కోవలసి వస్తే, పిల్లలు కనగలిగే వయసులో ఉన్న ఏ స్త్రీ అయినా దీన్ని వాడవచ్చును. బలాత్కారం జరిగిన సందర్భంలో కూడా దీన్ని వాడవచ్చును.
 
 
 
 
  ఐ-పిల్ తీసుకునే ముందు మా డాక్టరు దగ్గరకు వెళ్ళి చెక్-అప్ చేయించుకోవడం అవసరమా?
 

ఐ-పిల్ తీసుకోవడానికి వైద్య పరీక్ష/మెడికల్ చెక్-అప్ అవసరం లేదు. కాని, మీరు ఏదైనా తీవ్ర వ్యాధితో బాధపడుతూ ఉన్నా, లేదా మీకు లెవోనోర్జెస్ట్రెల్‌తో ఎలెర్జీ కలుగుతుందని తెలిసి ఉన్నా, డాక్టర్‌ని సంప్రదించడం మంచిది.

 
 
 
 
  ఐ-పిల్ ఎలా పని చేస్తుంది?
 

ఋతు చక్రంలో మీరున్న ప్రస్తుత స్థితిపై ఆధారపడి ఐ-పిల్ మూడు విధానాలలో ఏ విధంగానైనా పని చేయవచ్చ

  • అండాశయం నుంచి అండాన్ని విడుదల కాకుండా ఆపెయ్యవచ్చు.
  • అండం అప్పటికే విడుదల అయిపోయినట్టైతే, దాన్ని వీర్యాణువు ఫలవంతం చేయకుండా ప్రతిబంధించవచ్చు.
  • అండం అప్పటికే ఫలవంతం అయిపోయి ఉంటే, దాన్ని గర్భాశయం లోపొర మీద అతుక్కోనివ్వకుండా అడ్డగించవచ్చు.

ఫలవంతం అయిన అండం గర్భాశయానికి అతుక్కుపోయిన తరవాతే గర్భ ధారణ జరిగినట్టు నిర్ధారణం అవుతుందని గమనించవలసింది.

గర్భ ధారణ జరిగినట్టు నిర్ధారణం అయిపోయిన పక్షంలో ఐ-పిల్ పని చేయదు (అంటే ఫలవంతం అయిన అండం గర్భాశయానికి అతుక్కుపోయిన తరవాత). అందుచేత ఇది ఎబార్షన్ పిల్ కాదు.
 
 
 
 
  ఎమర్జెన్సీ కాంట్రాసెప్టివ్ పిల్‌కు, ఎబార్షన్ పిల్‌కు తేడా ఏమిటి?
 

వైద్యశాస్త్రానుసారం, ఫలవంతం అయిన అండం గర్భాశయం లోపొరకి అతుక్కోవడంతోనే గర్భధారణ మొదలవుతుంది.

ఎబార్షన్ పిల్స్‌లో యాంటీ ప్రొజెస్టిన్స్ అనబడే డ్రగ్స్ ఉంటాయి. ఇవి గర్భ ధారణ జరిగిన తరవాత గర్భాన్ని పెరగనివ్వకుండా ఆపేస్తాయి.

కాకుండా, సామాన్య స్త్రీ హార్మోన్లు కలిగి ఉన్న ఐ-పిల్ వంటి ఎమర్జెన్సీ కాంట్రాసెప్టివ్ పిల్స్ గర్భ ధారణ జరగనివ్వకుండా ముందే నిరోధిస్తాయి కనుక ఇవి ఎబార్షన్ కలిగించవు.

ఇంకా తెలుసుకునేందుకు, ఇక్కడ క్లిక్ చేయండి.

 
 
 
 
  ఐ-పిల్ నుంచి ఉత్తమమైన ఫలితాలు పొందడం ఎలా?
 

అసురక్షితమైన సెక్స్ జరిగిన తరవాతనో, లేక గర్భ నిరోధక సాధనాలు విఫలం అయిన తరవాతనో, వీలైనంత త్వరగా తీసుకుంటే, ఐ-పిల్ ఉత్తమంగా పని చేస్తుంది. కాని 72 గంటల ఆలస్యం తరవాత కాదు.

 
 
 
 
  ఐ-పిల్ ఎంత గుణకరమైనది?
 

మీరు ఐ-పిల్‌ని ఎంత త్వరగా వాడితే, అంత గుణకరమైనది. అసురక్షితమైన సెక్స్ జరిగిన తరవాత, 24 గంటల లోగా తీసుకుంటే, ఇది 95% గుణకరమైనది, 25 – 48 గంటల మధ్యన 85%, మరియు 49 – 72 గంటల మధ్యన తీసుకుంటే 58%. కాని మీ పీరియడ్ సరి అయిన సమయం తరవాత వారం రోజులు దాటి పోయినా రాకపోతే, మీరు ప్రెగ్నెన్సీ టెస్టు చేయించుకుని, మీ డాక్టర్‌ని సంప్రదించాలి.

 
 
 
 
  ఐ-పిల్ వల్ల నాకు ఏమైనా సైడ్-ఎఫెక్ట్స్ ఉంటాయా?
 

ఐ-పిల్ వల్ల దీర్ఘకాలపు సైడ్-ఎఫెక్ట్స్ గాని తీవ్రమైన సైడ్-ఎఫెక్ట్స్ గాని కలగవు. అందుచేత దాదాపు ప్రతి స్త్రీ దీన్ని సురక్షితంగా వాడవచ్చును. ఐ-పిల్ తీసుకున్న తరవాత కలిగే కొన్ని సాధారణమైన సైడ్-ఎఫెక్ట్స్ ఏమిటంటే వికారం, వాంతులు, తలనొప్పి. మీకు పొత్తికడుపులో కాస్త నొప్పిగా ఉండవచ్చు, లేదా మీ స్తనములు ఎప్పటికంటే నొప్పిగా ఉన్నట్టు ఉండవచ్చు. ఇవన్ని ఒకటి-రెండు రోజుల్లో తగ్గిపోవాలి. భగరంధ్రము నుంచి అకస్మాత్తుగా రక్తస్రావం జరిగే సంభావన ఉంది, కాని అది ప్రమాదకరం కాదు. అది మీకు మళ్ళీ పీరియడ్ వచ్చే సరికి సర్దుకుపోవాలి. ఐ-పిల్ వాడటం వల్ల మీ వచ్చే పీరియడ్ సరి అయిన సమయానికి కాస్త ముందుగానో లేక కాస్త ఆలస్యంగానో కూడా రావచ్చు. కాని మీ పీరియడ్స్ రావడం సరి అయిన సమయానికి వారం కన్నా ఆలస్యం అయితే, మీరు ప్రెగ్నెన్సీ టెస్టు చేయించుకుని, మీ డాక్టర్‌ని సంప్రదించాలి. ఐ-పిల్ వల్ల మీకు భవిష్యత్తులో కాబోయే (కావలసిన) ప్రెగ్నెన్సీలలో, కష్టం కలిగించగలిగే దీర్ఘకాలపు పరిణామాలు ఏమీ ఉండవు.

ఐ-పిల్‌లో ఉన్న లెవోనోర్జెస్ట్రెల్ అనే మందు పదార్థం వల్ల మీకు ఎలెర్జీ కలిగే పక్షంలో, ఐ-పిల్ వాడుక సిఫారసు చేయబడదు.

 
 
 
 
  ఐ-పిల్ వాడే ముందు నేను తీసుకోవలసిన హెచ్చరికలు ఏమైనా ఉన్నాయా?
 

ఐ-పిల్ వాడే ముందు మీరు తెలుసుకోవలసిన విషయాలు ఇవి – ఎ. అసురక్షితమైన సెక్స్ జరిగిన తరవాతగాని, గర్భ నిరోధక సాధనాలు విఫలం అయినప్పుడుగాని, వీలైనంత త్వరగా ఐ-పిల్ తీసుకుంటే, ఉత్తమంగా పని చేస్తుంది. కాని 72 గంటలు దాటిన తరవాత కాదు.

  • మీరు అప్పటికే గర్భం ధరించిన పక్షంలో ఐ-పిల్ పని చేయదు.
  • దీన్ని నియమానుసార గర్భ నిరోధక పద్ధతిగా కూడా వాడకూడదు.
  • ఐ-పిల్ హెచ్ఐవీ/ఏయిడ్స్ నుంచి గాని లైంగిక సంపర్కం వల్ల సంక్రమించే ఇతర రోగాల నుంచి గాని రక్షణ ఇవ్వదు.
 
 
 
 
  ఐ-పిల్ పని చేసిందని నాకు ఎలా తెలుస్తుంది?

 

ఐ-పిల్ పని చేసిందో లేదో తెలుసుకునేందుకు బలమైన ఋజువులుగాని, లక్షణాలుగాని లేవు. మీరు ఐ-పిల్ తీసుకున్న తరవాత, ఆగి, మీ వచ్చే మెన్ట్ర్సువల్ పీరియడ్ కోసం ఎదురు చూడాలి. అది అనుకున్న సమయానికిగాని, అనుకున్న సమయానికి వారం లోగాగాని రావాలి. ఒకవేళ మీ మెన్ట్ర్సువల్ పీరియడ్ వారం పైగా గడిచిన తరవాత కూడా రాకపోతే, ప్రెగ్నెన్సీ టెస్టు చేయించుకుని, డాక్టర్‌ని సంప్రదించడం మంచిదని మా సలహా.
 
 
 
   
  ఐ-పిల్‌ను నేను నియమానుసార గర్భ నిరోధకానికి ఉపయోగించవచ్చునా?
  ఉపయోగించకూడదు. నియమానుసార గర్భ నిరోధకానికి ఐ-పిల్ సిఫారసు చేయబడలేదు. అసురక్షితమైన సెక్స్ జరిగిన తరవాతనో, లేక గర్భ నిరోధక సాధనాలు విఫలం అయిన తరవాతనో ఐ-పిల్‌ని గర్భ నిరోధకానికి మద్దతునిచ్చే సాధనంగా ఉపయోగిస్తే గుణకరంగా పని చేస్తుంది. ఐ-పిల్‌ని మీ నియమానుసార గర్భ నిరోధక సాధనాలకు బదులుగా ఉపయోగించకుండా జాగ్రత్త పడండి.
 
 
 
   
  ఐ-పిల్‌ని ఎంత తరచుగా ఉపయోగించవచ్చును?
 

ఐ-పిల్‌ని ఒక సైకిల్‌లో ఒకసారి కంటే ఎక్కువగా వాడవచ్చును కాని ఇది కేవలం ఒక ఎమర్జెన్సీ కాంట్రాసెప్టివ్‌గా మాత్రమే సిఫారసు చేయబడినది.

నియమానుసార గర్భ నిరోధకానికి ఐ-పిల్ సరి అయినది కాకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి:

  • మళ్ళీ మళ్లీ ఇ.సి. వాడే కన్నా, ఏ నియమానుసార గర్భ నిరోధక సాధనాలైనా ఎక్కువ ఉపయోగకరమైనవి.
  • దీర్ఘకాలం వరకు ఐ-పిల్‌ని ఎక్కువగా వాడితే, మెన్ట్ర్సువల్ సైకిల్ క్రమము తప్పవచ్చును.

ఇది వికారం, వాంతులు, వంటి ఇబ్బంది కలిగించే సైడ్-ఎఫెక్ట్స్ కలిగించవచ్చును.

గుర్తుంచుకోండి, అసంకల్పిత గర్భ ధారణ జరగకుండా ఉండటానికి నియమానుసార గర్భ నిరోధక సాధనాలు ఉపయోగించడం కొనసాగిస్తూ ఉండాలి.

 
 
 
   
  నేను ఐ-పిల్ వేసుకునేటప్పటికే గర్భవతిని అయి ఉంటే ఏమవుతుంది?
  మీరు అప్పటికే గర్భవతి అయి ఉంటే ఐ-పిల్ పని చేయదు. మీరు గర్భవతి అయి ఉండగా ఐ-పిల్ తీసుకున్నా కూడా, మీకుగాని, మీ గర్భపిండానికిగాని ఎటువంటి హాని కలగదు.
 
 
 
   
  వారం రోజులు పైగా దాటిపోయినా నా మెన్ట్ర్సువల్ పీరియడ్ రాకపోగా నాకు పొత్తి కడుపులో తీవ్రమైన నొప్పి ఉంటే, నేను ఏం చెయ్యాలి?
  అటువంటి పరిస్థితిలో తక్షణమే మీ డాక్టర్‌ని సంప్రదించడం చాలా అవసరం. ఎందుకంటే మీకు వెంటనే చికిత్స అవసరం కావచ్చును.
 
 
 
   
  వచ్చే మెన్ట్ర్సువల్ సైకిల్ వరకూ ఐ-పిల్ ఒక గుణకరమైన గర్భ నిరోధక సాధనంగా పని చేస్తుందా?
  చెయ్యనే చెయ్యదు. మీరు ఐ-పిల్ వేసుకున్న తరవాత, మళ్ళీ మెన్ట్ర్సువల్ పీరియడ్ వచ్చే వరకూ, శారీరక సంపర్కం జరిగిన ప్రతి సారి కాండోమ్, స్పర్మిసైడ్ లేక సర్వైకల్ క్యాప్ వంటి బ్యారియర్ కాంట్రాసెప్టివ్ తప్పకుండా వాడండి.
 
 
 
   
  తక్కువ కాలంలోనే పలుమార్లు శారీరక సంపర్కం జరిగినా ఐ-పిల్ గుణం చూపిస్తుందా?
  తక్కువ కాలంలోనే పలుమార్లు శారీరక సంపర్కం జరిగినా ఐ-పిల్ మీకు అంత గుణకరంగానూ పని చేస్తుంది. కాని ఆ క్రియలన్ని ఐ-పిల్ తీసుకునే ముందు 72 గంటలలోనే జరిగి ఉండాలని గుర్తుంచుకోండి.
 
 
 
   
  రాబోయే కొద్ది రోజుల్లో (ఉదాహరణకి, ఎక్స్‌టెండెడ్ వీకెండ్ హాలిడే) మళ్ళీ శారీరక సంపర్కం జరగవచ్చునని నాకు తెలిసినప్పుడు, కాస్త ఆగి, తరవాత పిల్ వేసుకోవచ్చునా? లేక ఆ వ్యవధిలో శారీరక సంపర్కం జరిగినప్పుడల్లా పిల్ వేసుకోవడం అవసరమా?
  ఐ-పిల్ ఒక ఎమర్జెన్సీ కాంట్రాసెప్టివ్. శారీరక సంపర్కం జరగవచ్చునని ముందే తెలిసినప్పుడు, మీరు గర్భవతి కాదల్చుకోకపోతే, నియమానుసారంగా వాడబడే గర్భ నిరోధక సాధనాలు ఉపయోగించమని గట్టిగా సిఫారసు చెయ్యబడుతున్నది. దయచేసి, ఈ విషయంగా మీ డాక్టర్‌ని సంప్రదించండి.
 
 
 
   
  ఐ-పిల్ వాడిన తరవాత నాకు మళ్ళీ పీరియడ్స్ ఎప్పుడు వస్తాయి?
  మీకు మళ్ళీ పీరియడ్ సరి అయిన సమయానికే రావాలి. కాని కొద్ది రోజుల ముందుగానో, లేక కొద్ది రోజులు ఆలస్యంగానో కూడా రావచ్చును. ఒకవేళ మీ పీరియడ్ సరి అయిన సమయం తరవాత వారం రోజులు దాటి పోయినా రాకపోతే, దయచేసి, ప్రెగ్నెన్సీ టెస్టు చేయించుకుని, మీ డాక్టర్‌ని సంప్రదించండి.
 
 
 
   
  హెచ్ఐవీ/ఎయిడ్స్ వంటి లైంగిక సంపర్కం వల్ల సంక్రమించే రోగాల (STDs) నుంచి రక్షణ పొందేందుకు ఐ-పిల్ సహకరిస్తుందా?
  ఎప్పటికీ సహకరించదు. హెచ్ఐవీ/ఏయిడ్స్ నుంచి గాని, లైంగిక సంపర్కం వల్ల సంక్రమించే ఇతర రోగాల నుంచి గాని, ఐ-పిల్ సంరక్షించదు. STDs నుంచి మిమ్మల్ని మీరు సంరక్షించుకునేందుకు కాండోమ్స్ వాడటం మంచిది.
 
 
 
   
  చనుబాలు ఇస్తున్న తల్లినైతే, ఐ-పిల్ వాడవచ్చునా?
 

చనుబాలు ఇస్తున్నప్పుడు ఐ-పిల్ వాడటం సురక్షితమే. ఐ-పిల్ వాడటం వల్ల, మీ చనుబాల గుణంలో, మీ శిశువుపై పరిణామం చూపించగలిగినంత మార్పు కలిగే సంభావన, ఏమీ ఉండబోదని అనవచ్చును.

 
 
 
   
  ఎమర్జెన్సీ కాంట్రాసెప్ష్‌న్ విఫలం అయితే, నేను ప్రెగ్నెన్సీని కొనసాగించవచ్చునా?
  మీరు కావాలనుకుంటే, మీ ప్రెగ్నెన్సీని కొనసాగించవచ్చును. ఐ-పిల్‌లో ఉపయోగించబడే మందు వల్ల మీకుగాని మీ బిడ్డకుగాని ఎటువంటి హాని కలగదు. మీరు మీ ప్రెగ్నెన్సీని కొనసాగించదల్చని పక్షంలో, దయచేసి మీ డాక్టర్‌ని సంప్రదించండి.
 
 
 
   
  నేను ఒక వ్యాధితో బాధ పడుతూ, దాని కోసం దీర్ఘకాలంగా మందులు తీసుకుంటున్నట్టైతే (ఆస్థమా, అధిక రక్తపోటు, డయాబెటీస్, ట్యుబర్క్యులోసిస్, HIV-AIDS,మొదలైనవి), ఐ-పిల్ నాకు సురక్షితమైనదేనా?
  అటువంటి పరిస్థితులలో, మీరు ఐ-పిల్ తీసుకునే ముందు, డాక్టర్‌ని సంప్రదించడం మంచిది.
 
 
 
   
  నేను ఐ-పిల్ వేసుకున్న తరవాత వాంతి చేసుకున్నాను. మళ్ళీ ఇంకొకటి వేసుకోవాలా?
  మాత్ర వేసుకున్న 3 గంటలలోగా వాంతి చేసుకుంటే, వీలైనంత త్వరగా మరొక మాత్ర వేసుకోవాలి. యాంటీ ఎమెటిక్స్‌తో పాటూ (వాంతులకీ, వికారానికీ గుణకరమైన డ్రగ్స్) తీసుకుంటే మేలు. ఐ-పిల్‌ని ఉత్తకడుపున వేసుకోకుండా ఉంటే, మీరు వాంతి చేసుకునే సంభావన తగ్గవచ్చును.
 
 
 
   
  నేను వాడే నియమానుసార గర్భ నిరోధక మాత్రలు మళ్ళీ ఎప్పటి నుంచి తీసుకోవడం ప్రారంభించాలి?
  మీరు ఇదివరకు వాడిన గర్భ నిరోధక పద్ధతిని మొదలు పెడుతున్నా, లేక కొత్త దానికి మారుతున్నా, దాన్ని మీరు ఐ-పిల్ తీసుకున్న మరుసటి రోజు నుంచి మొదలు పెట్టవచ్చును. కాకపోతే, మీ డాక్టర్‌ని సంప్రదించి, మీ గర్భ నిరోధక పద్ధతిపై పునర్విచారణ చేసి, మీకు అన్నిటికన్నా అనువైనది ఏదో కనుక్కోవడానికి, ఇది సరి అయిన సమయం కావచ్చును.
 
 
 
   

 

 

 

i-pill
i-pill is available without a prescription at all chemist outlets. i-pill is not an abortion pill.

Mail this page  |  Print this page

 
For more information call the i-pill helpline at 1800-22-9898 or 022-3200 0055
Important safety aspects: i-pill is neither a regular contraceptive nor an abortion pill. It is not a substitute for condoms and
does not protect against sexually transmitted diseases including HIV/AIDS.